Farmers Agitation At MRO Office For Cheques : మల్లన్నసాగర్ జలాశయానికి అదనపు టీఎంసీ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి చెక్కులు ఇవ్వాలని ఘనపూర్ నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. తొగుట తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వారికి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్వాసితులకు చెక్కులు ఇచ్చే వరకు కదిలేది లేదని వారితో పాటు కార్యాలయంలో బైఠాయించారు.
మల్లన్న సాగర్ జలాశయానికి అదనపు టీఎంసీ కాలువ నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించి నిర్వాసితులకు చెక్కులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ పేరిట వచ్చిన చెక్కులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
Farmers Land To TMC Canal in Mallanna Sagar Project : తహసీల్దార్ మాత్రం చెక్కులను కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన నిర్వాసితులు ఆయన గదిలోనే కూర్చుని.. తమ చెక్కులు ఇచ్చే వరకు ఎక్కడికి కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భూ నిర్వాసితులతో పాటు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. మల్లన్న సాగర్ జలాశయానికి అదనంగా టీఎంసీ కాలువ నిర్మాణానికి ఘనపూర్ రైతులు భూములను ఇచ్చారు. అయితే అప్పుడు రైతులు భూములు ఇస్తే అందుకు తగిన నగదును చెక్కుల రూపంలో పరిహారంగా చెల్లిస్తామని.. రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే నేడు ఈ చెక్కులు రావడంతో రైతులు వెళ్లి అడిగితే.. ఈ పరిస్థితి నెలకొంది.
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనుల కొనసాగింపై ఎన్టీజీ సీరియస్ : మరోవైపు.. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిలిపి వేయాలని ఆదేశాలిచ్చిన తర్వాత కూడా.. తమ ఆదేశాలకు విరుద్ధంగా పనులు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు లేనందున సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది.
NTG Serious Continuation Of Seethamma Sagar Project : పనులు కొనసాగించడం ధిక్కరణకు పాల్పడడమేనని ట్రైబ్యునల్ పేర్కొంది. ఈ విషయంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని గోదావరి బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖలపైనా ఎన్టీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అందుకు తగిన నివేదిక ఇవ్వాలని.. గోదావరి బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీజీ ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి :