ETV Bharat / state

నాగలితో ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు

author img

By

Published : Apr 27, 2021, 4:56 PM IST

ఓవైపు కూలీల కొరత, మరోవైపు అకాల వర్షాల వల్ల విసిగిన సిద్దిపేట జిల్లాలోని ఓ రైతన్న... ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొత్తగా ఆలోచించాడు. నాగలి సహాయంతో సులభంగా అరగంటలో ధాన్యాన్ని ఆరబోయడం.. తిరిగి కుప్పగా చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

 drying grain, plow, mothukulapalli, siddipeta

ధాన్యాన్ని ఆరబెట్టడానికి సరిపడా కూలీలు లేకపోవడం వల్ల ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. నాగలితో సులభంగా ధాన్యాన్ని ఆరబెడుతూ పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోతుకులపల్లిలో జరిగింది.

మోతుకులపల్లికి చెందిన భూక్య తిరుపతి తన వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రతిరోజు ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు. సరిపడా కూలీలు లేకపోవడం వల్ల నాగలి సాయంతో వడ్లను ఆరబోస్తున్నాడు. గ్రామంలో ఉపాధి హామీ పనులు నడుస్తుండటం వల్ల కూలీల కొరత ఏర్పడింది. అందువల్ల ఇలా కొత్త ఉపాయం ఆలోచించానని రైతు చెబుతున్నాడు.

20 ట్రిప్పుల ధాన్యాన్ని గంట లోపు నాగలి సహాయంతో ఆరబోస్తున్నామని.. 10 మంది కూలీలు చేసే పనిని పదిహేను నిమిషాల్లో ప్రతిరోజు ఆరబోస్తూ, తిరిగి కుప్పగా పోస్తున్నామన్నారు. ఈ విధంగా చేయడం బాగుందని రైతు తెలిపాడు.

ఇదీ చూడండి: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.