ETV Bharat / state

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - former

భూ తల్లిని నమ్ముకున్న రైతుకు కన్నీల్లే  మిగులుతున్నాయి. వర్షాభావం ఓ వైపు... అప్పులు బాధ మరోవైపు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రుణమాఫీ అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి మాఫీ చేయలేదు. ఇక ఏం చేయాలో తెలియని ఓ రైతు ఆత్మహత్య  చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేశవాపూర్​లో జరిగింది.

ఎండిపోయిన మొక్కజొన్న
author img

By

Published : Jul 17, 2019, 5:20 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్​కు చెందిన గంధపు కనకయ్య గౌడ్​(58) అనే రైతు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కనకయ్య సంవత్సరం క్రితం చిన్న కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు దివ్యాంగుడు. ఈ ఖరీఫ్​లో 3 ఎకరాల భూమిలో మొక్కజొన్న, పత్తి విత్తనాలు వేశారు. వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తలేదు. మరోవైపు అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడం వల్ల మనస్తాపం చెందిన కనకయ్య గౌడ్​ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడికి 3 ఎకరాల భూమి ఉన్నా ఇంకా పట్టాకాలేదు. రైతుబంధు, రైతు బీమా కూడా రైతు కుటుంబానికి వర్తించదని గ్రామ సర్పంచ్​ అన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఇవీ చూడండి: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

Intro:TG_KRN_101_17_APPULA BADHATHO_RYTHU ATHMAHATHYA_AVB_TS10085
FROM:KAMALAKAR HUSNABAD 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన గంధపు కనుకయ్య (58) అనే రైతు అప్పుల బాధలు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన రైతుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సంవత్సరం క్రితం చిన్న కుమార్తె వివాహం చేశాడు. కుమారుడు అంగవైకల్యుడు కావడంతో కుటుంబానికి పోషకుడిగా, పెద్దదిక్కుగా మృతుడు కనుకయ్య ఉండేవాడు. ఈ ఖరీఫ్ సీజన్లో తనకు వారసత్వంగా సంక్రమించిన 3 ఎకరాల మెట్ట పొలంలో మొక్కజొన్న, పత్తి విత్తనాలు వేసాడు. వర్షాలు కురువక పొలంలో వేసిన విత్తనాలు సరిగా మొలకెత్తక పోవడంతో, కుమార్తె వివాహం తో పాటు, పొలం పనులకు తీసుకువచ్చిన అప్పులు భారం కావడం దాదాపు 12 లక్షల రూపాయల వరకు అప్పులు పేరుకుపోవడంతో మనస్తాపానికి గురైన రైతు కనుకయ్య ఉదయం తన వ్యవసాయ క్షేత్రం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుడు కనకయ్య పేరు మీద ఇంకా 3 ఎకరాల భూమి పట్ట కాలేదు, రైతుబంధు, రైతు భీమా కూడా రైతు కుటుంబానికి వర్తించకపోవడం వల్ల కుటుంబానికి ఆదరణ కరువైందని గ్రామ సర్పంచ్, కుటుంబ సభ్యులు వాపోయారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

Body:బైట్
1) బొమ్మగాని రాజేశం కేశవాపూర్ గ్రామ సర్పంచ్
2) గంగాధరి రాజయ్య రైతు సమన్వయ సమితి సభ్యులు

Conclusion:అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.