సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురవుతున్న సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు కష్టం కలగకుండా కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం కొనసాగించాలని పొన్నం కోరారు. లేదంటే రైతులు రోడ్డెక్కితే వారికి మద్దతుగా తాము ఉంటామన్నారు.
ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయించడంపై సీఎం కేసీఆర్ చూపిస్తున్న శ్రద్ధ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుపై చూపించడం లేదని ప్రభాకర్ ఆరోపించారు. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టును పూర్తి చేయించడం స్థానిక ఎమ్మెల్యే వల్ల కాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ. 20 వేల కోట్లు అప్పు తెచ్చామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెప్పడం కాదు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి.. వారికి డబ్బులు త్వరగా వచ్చేలా చూడాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి: టార్పాలిన్ల సరఫరాకు చేతులెత్తేసిన గుత్తేదారు.. టెండర్లు రద్దు