సిద్దిపేట జిల్లాలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ పనితీరుపై అధికారులతో మాజీ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. వసతి గృహాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పదిరోజుల్లో అదనపు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నెల రోజుల్లో ఆకస్మిక తనిఖీ చేస్తానన్నారు. విద్యార్థులతోనే నిద్రిస్తానని తెలిపారు. ఆయా సమయాల్లో వార్డన్లు అందుబాటులో లేకపోయినా, విద్యార్థుల నుంచి ఫిర్యాదులందినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చింతమడకలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు రూ. 5 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి
-