ETV Bharat / state

వీడలేక వీడుతున్న మల్లన్నసాగర్​ ముంపు గ్రామాల ప్రజలు - పల్లెపహాడ్‌

చెమటోడ్చి పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న సొంతిల్లు.. తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా కాపాడుకుంటున్న అనుభవాల పొదరిల్లు.. కొందరి జీవితకాలపు కష్టం.. మరికొందరి తరతరాల జ్ఞాపకం.. అనుభవం ఏదైనా అన్నీ వదులుకోవాల్సిన పరిస్థితి. కేవలం ఇళ్లు మాత్రమే కాదు చుట్టుపక్కల వారి ఆప్యాయ పిలుపులు, అనుబంధపు పలకరింపులు, మమకారాలను సైతం వదులుకోవాల్సిన తరుణం. ఇదీ సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్​ ముంపు గ్రామాల్లోని ప్రజల పరిస్థితి.

emotional movements of Mallanna Sagar Mumpu villagers
వీడలేక వీడుతున్న మల్లన్నసాగర్​ ముంపు గ్రామాల ప్రజలు
author img

By

Published : Apr 8, 2021, 7:55 AM IST

సొంత ఊరితో ఉన్న జ్ఞాపకాలు వారి కాళ్లను కట్టి పడేస్తున్నా..తప్పనిసరై ఒక్కో కుటుంబం ఊరు వదిలివెళ్తోంది. తమ వంతు కూడా ఏదో ఒక రోజు వస్తుందనే దిగులుతో మిగిలిన వారి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలైన పల్లెపహాడ్‌, వేములఘాట్‌లలో నెలకొన్న ఉద్విగ్న సన్నివేశాలు కలచివేశాయి.

సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం 50 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే. జలాశయం పనులు చివరి దశకు చేరడంతో ముంపు గ్రామాలైన పల్లెపహాడ్‌, వేములఘాట్‌ గ్రామాల ప్రజలు రెండు రోజులుగా వారికి కేటాయించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీకి (రిహాబిలిటేషన్‌, రీసెటిల్‌మెంట్‌) తరలి వెళ్తున్నారు. బుధవారం ఆయా గ్రామాల్లో పలు కుటుంబాలు ఊరు విడిచి వెళ్తున్న సమయంలో చుట్టు పక్కల వారిని చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఇంతకాలం ఈ మట్టితో ఉన్న అనుబంధాన్ని ఒక్కసారిగా వదిలేయడం ఎలా అంటూ ఆవేదన చెందారు. చదివిన బడి, మొక్కిన గుడి, తిరిగిన వీధులు, అన్నీ ఒక్కసారిగా మాయమైపోతుంటే ఉండేదెలా అంటూ రోధించారు.

వేములఘాట్‌ గ్రామానికి ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో 396 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. బుధవారం 57 కుటుంబాలు గ్రామాన్ని ఖాళీ చేసి కొత్త కాలనీకి చేరుకున్నాయి. ఇప్పటికి ఆ గ్రామంలో 173 కుటుంబాలు ఖాళీ చేశాయి. పల్లెపహాడ్‌లో ఇప్పటివరకు 423 కుటుంబాలకు పునరావాసం కల్పించగా 58 కుటుంబాలు కొత్త ఇళ్లలో గృహ ప్రవేశాలు చేశాయి.

ఇదీ చూడండి: ముప్పు తప్పించే వారిపైనే కూలిన కప్పు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.