సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, వార్డు మెంబర్ల సమక్షంలో సర్పంచ్ రాములు గ్రామస్థులకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు.
ప్రజలు చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రాములు పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి.. చెత్త సేకరణకు వచ్చే పంచాయతీ ట్రాక్టర్లో వేయాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో, రోడ్డుపైన, మురికి కాల్వల్లో చెత్త వేస్తే రూ. 2000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలంతా సీజనల్ వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీచూడండి.. న్యాయం కోసం మృతుల కుటుంబసభ్యుల ధర్నా