ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ మోసానికి దేవుళ్లూ అతీతులు కారు'

author img

By

Published : Jan 10, 2021, 10:29 PM IST

Updated : Jan 10, 2021, 11:04 PM IST

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్​ మోసాలకు దేవుళ్లూ అతీతులు కారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కొమురవెల్లి ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చిన హమీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

dubbaka mla raghunandan rao visited komuravelli
'సీఎం కేసీఆర్​ మోసానికి దేవుళ్లు కూడా ఆతీతులు కారు'

ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజలనే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆయన... ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పొద్దున ఇచ్చిన మాటను రాత్రి వరకు మర్చిపోవటం సీఎం కేసీఆర్​కు అలవాటేనని ఆరోపించారు. కొమురవెల్లిని టెంపుల్​ సిటీగా తయారు చేస్తానని ఇచ్చిన మాటను ఎప్పుడో మర్చిపోయారని దుయ్యబట్టారు.

ఏడేళ్లుగా ఆలయానికి కనీసం డిప్యూటీ కమిషనర్​ స్థాయి అధికారిని నియమించలేకపోతున్నారని విమర్శించారు. కేసీఆర్​ నిబద్ధత గల పాలనకు కొమురవెళ్లి దేవస్థానమే తార్కాణమని ఎద్దేవా చేశారు. కొమురవెల్లి ఆలయ అభివృద్ధి కోసం గతంలో కేసీఆర్ ఇచ్చిన హమీలను వెంటనే పూర్తి చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ఆధునిక పద్ధతిలో పంటల సాగు... లాభాలు బహుబాగు

Last Updated : Jan 10, 2021, 11:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.