ETV Bharat / state

మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉపఎన్నిక ఫలితం.. తేలనున్న భవితవ్యం - dubbaka constituency in siddipet district

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గానికి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగగా.. ఫలితాలపై ఎప్పుడూ లేనంత ఆసక్తి ఈసారి ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. ప్రచారం పోటాపోటీగా సాగింది. మరికొన్ని గంటల్లో ఎవరి వ్యూహాలు ఫలించాయో.. ఏ పార్టీని విజయం వరించనుందో తేలనుంది.

dubbaka constituency by election result 2020
దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు
author img

By

Published : Nov 9, 2020, 10:21 AM IST

Updated : Nov 9, 2020, 10:50 AM IST

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఏర్పడింది. రద్దైన దోమ్మాట, రామాయంపేట నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ దుబ్బాక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగగా.. రెండు పర్యాయాలు సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డిల మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో చెరుకు ముత్యంరెడ్డి విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. దుబ్బాకకు ఇప్పటి వరకు శాసన సభ్యులుగా సేవలందించిన ఇద్దరూ చనిపోవడం గమనార్హం.

బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు

2020 ఆగస్టులో అనారోగ్యంతో రామలింగారెడ్డి మృతి చెందడం వల్ల దుబ్బాక నియోజకవర్గాని తొలి ఉపఎన్నిక వచ్చింది. ఉపఎన్నిక బరిలో.. తెరాస నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ నుంచి ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి, భాజపా నుంచి రఘునందన్ రావు నిలిచారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తెరాస తరఫున ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భాజపా తరఫున మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రంగంలోకి దిగారు.

ఎన్నికల మాంత్రికుడు హరీశ్ రావు వ్యూహాలు

గెలిచితీరాలన్న లక్ష్యంతో ఆయా పార్టీలు ప్రచారంలోకి దిగాయి. ఎన్నికల మాంత్రికుడిగా పేరున్న హరీశ్ రావు.. తమ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గంలోని ఒక్కో మండలం బాధ్యతలు అప్పగించారు. వీరికి అదనంగా కార్పొరేషన్ ఛైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు ఇంఛార్జీలుగా ఉన్నారు. మండల, గ్రామ స్థాయిల్లో తమ నాయకుల మధ్య ఉన్న విభేదాలు తొలగించి అంతా సమష్టిగా విజయం కోసం పనిచేసేలా చేయడం, ప్రతి గ్రామంలో తెరాసకే ఓట్లలో ఆధిక్యం వచ్చేలా రంగం సిద్ధం చేయడం వంటి పనులు వీరికి అప్పగించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక నాయకుణ్ని బాధ్యునిగా నియమించారు. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందిన సంక్షేమ ఫలాలు, ప్రయోజనాలు గుర్తు చేయడం.. ప్రభుత్వం పట్ల వారికి ఎమైనా అసంతృప్తి ఉంటే దాన్ని తొలగించి.. వారు కారు గుర్తుకే ఓటు వేసేలా చేయడం వంటి బాధ్యతలు వీరికి అప్పగించారు.

దుబ్బాకలోనే ఉత్తమ్ మకాం

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా దుబ్బాకలోనే మకాం వేశారు. క్యాంపు కార్యాలయం తెరిచి అక్కడి నుంచి రాష్ట్ర వ్యవహారాలతో పాటు ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షించారు. ప్రతి మండలానికి ఓ మాజీ మంత్రిని బాధ్యునిగా నియమిస్తూ.. వీరికి అదనంగా మాజీ పార్లమెంటు సభ్యులను అందుబాటులో ఉంచారు. మాజీ ఎమ్మెల్యేలకు గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలు వీరికి అప్పగించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ ఖాతాలో వేసుకునేలా కార్యాచరణ రూపొందించి.. రంగంలోకి దిగారు.

భాజపా గెలుపు బాధ్యత ఆయనదే..

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి భాజపా గెలుపు బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. దుబ్బాకలో విజయం సాధించి.. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు ఇవ్వాలన్న లక్ష్యంతో వ్యూహాలు రూపొందించారు. సీనియర్ నాయకులకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. తెరాసకు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోయారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలను రంగంలోకి దించారు. చిన్న చిన్న బృందాలుగా ఏర్పడిన వీరు.. ఇంటింటికి తిరిగి తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఎన్నికల ప్రక్రియ తుది దశలో పార్టీల మధ్య ఉన్న పోటీ రసవత్తరంగా మారింది. విమర్శలు.. ప్రతి విమర్శలు.. దాడులు.. ప్రతిదాడులతో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ఎవరి వ్యూహాలు ఫలించాయో.. విజయం ఎవరిని వరించనుందో.. అత్యంత ఆసక్తి రేకెత్తించిన దుబ్బాక ఉపఎన్నికలో ఏ పార్టీ జెండా రెపరెపలాడనుందో రేపు తేలనుంది.

Last Updated : Nov 9, 2020, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.