సిద్దిపేట డబ్బుల వ్యవహారంపై దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు స్పందించారు. పక్కింట్లో దొరికిన డబ్బులను తనవే అని పంచనామా రాశారన్నారు. ఒకే సామాజిక వర్గమైనంత మాత్రాన మా బంధువులంటే ఎలా అని ప్రశ్నించారు. తాను ఏ తప్పు చేయలేదని.. పోలీసుల్ని, చట్టాన్ని గౌరవిస్తున్నానని పేర్కొన్నారు.
"ఎన్నికల ప్రచారం చేయకుండా అన్యాయం చేస్తున్నారు. సోదాల్లో మా ఇంట్లో డబ్బులు దొరక్కపోయినా ఇబ్బందులు పెడుతున్నారు. నాపై కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి పక్కకు తప్పించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది"
-రఘునందన్‌రావు, దుబ్బాక భాజపా అభ్యర్థి
ఇదీ చూడండి: 'భాజపా కార్యకర్తలు తమ తప్పులేదని రుజువు చేసుకోవాలి'