ETV Bharat / state

సొంతింటి కల నెరవేరిన వేళ.. లబ్ధిదారుల ఆనంద హేళ

సొంత ఇల్లు సగటు మనిషి జీవితకాల కల. పేద మధ్యతరగతి ప్రజలకు ఇది అందని ద్రాక్ష. పేదవాడికి గూడు కల్పించేందు కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చాయి. ఏ ప్రభుత్వమైనా.. ఏ పథకమైనా అంతంత మాత్రమే. కొన్ని చోట్ల మురికి వాడలను తలపించేలా ఇళ్లను కట్టించి మమ అని పించుకున్న దాఖలాలు కుడా ఉన్నాయి. కానీ సిద్దిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను చూస్తే మాత్రం ఔరా అనాల్సిందే.

double bed rooms in siddipeta
సొంతింటి కల నెరవేరిన వేళ.. లబ్ధిదారుల ఆనంద హేళ..
author img

By

Published : Dec 13, 2020, 2:09 PM IST

సిద్దిపేటలో నిర్మించి న రెండు పడగ గదుల ఇళ్ల సముదాయంలోకి కొత్తగా వచ్చిన వారు.. ఇది పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన కాలనీ అంటే ఆశ్యర్యపోక తప్పదు. పెద్ద పెద్ద నగరాల్లో నిర్మించే గేటేడ్ కమ్యూనిటీలకు ఏమాత్రం తీసిపోని.. ఆ మాటకు వస్తే అంత కంటే ఎక్కువ సౌకర్యాలతో నిర్మించారు. పక్కా ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణతో దేశంలో మరేక్కడ లేని విధంగా ఇల్లు లేని పేదల కోసం కాలనీ నిర్మించారు.. అదే కేసీఆర్ నగర్.

163కోట్ల రూపాయలతో 35ఎకరాల విస్తీర్ణంలో

కేసీఆర్ నగర్​ను 163కోట్ల రూపాయలతో 35ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. జీ+2 తరహాలో 205 బ్లాకులుగా నిర్మించారు. ప్రతి బ్లాకులో 12 చొప్పున మొత్తం 2460 రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు. ప్రతి ఇంటికి గాలి, వెలుతురు నిరాటంకంగా ప్రసరించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఇల్లు కూడా 560 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక హలు, వంట గది, రెండు పడక గదులు, బాల్కనీ, భారతీయ శైలిలో ఒకటి, పాశ్చాత్య శైలిలో మరోకటి ఇలా రెండు శౌచాలయాలు ప్రతి ఇంటికి ఏర్పాటు చేశారు. కాలనీ మొత్తం ప్రతి బ్లాకును అనుసంధానించేలా విశాలంగా సీసీ రోడ్లు వేశారు. ప్రధాన రహదారులను మరింత విశాలంగా వేసి.. మధ్యలో డివైడర్లు సైతం ఏర్పాటు చేశారు. ముందస్తు ఆలోచనతో నిర్మాణం ప్రారంభంలోనే మూడు సంవత్సరాల క్రితం రోడ్డు పక్కల నాటిని మొక్కలు చెట్లుగా ఎదిగి.. పచ్చదనాన్ని పంచుతున్నాయి. వర్షం నీరు వృథా కాకుండా ప్రతి బ్లాకుకు ఓ ఇంకుడు గుంతను నిర్మించారు. అంగన్ వాడీ కేంద్రం, పాఠశాలకు స్థలం వంటి కనీస అవసరాలే కాదు.. అత్యాధునీక సదుపాయలు ఈ కేసీఆర్ నగర్ సొంతం.

24 గంటలు నిరంతరాయంగా నీటి సరఫరా

ఖరీదైన గేటేడ్ కమ్యూనీటిల్లో సైతం లేని విధంగా ఇక్కడ పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నారు. ఇందు కోసం ప్రతి ఇంటికి ప్రత్యేకంగా మీటర్ సైతం ఏర్పాటు చేశారు. రెండు నెలలకు ఒకసారి.. వినియోగదారులు వాడకాన్ని బట్టి రుసుం వసూలు చేయనున్నారు. పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయడంతో సిలిండర్ కంటే 25శాతం తక్కువ ధరకే గ్యాస్ లభించనుంది. ప్రతి ఇంటికి 24 గంటలు నిరంతరాయంగా నీటి సరఫరా చేయనున్నారు. ఇందుకోసం 6లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు ట్యాంకులు సైతం నిర్మించారు. రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాకు అంత రాయం ఏర్పడినా.. కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా.. రెండు రోజులకు సరిపోయే సామర్థ్యంతో సంపును ఏర్పాటు చేశారు. వృథాను ఆరికట్టేందుకు ప్రతి ఇంటికి నీటి మీటరును బిగించారు. కాలనీ వాసులకు ఆహ్లాదం పంచేలా నాలుగు చోట్ల పార్కులు, నిత్యవసరాల కోసం బయటికి వెళ్లకుండా ఇంటిగ్రెటేడ్ మార్కెట్, 5మినీ దుకాణ సముదాయాలు ఏర్పాటు చేశారు. 4000 మంది సామర్థ్యంతో ఆధునిక హంగులతో ఫంక్షన్ హాల్ సైతం నిర్మించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు ‍ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. వైద్య అవసరాల కోసం ఓ బస్తీ దవాఖాన సైతం మంజూరు చేశారు. భవిష్యత్ అవసరాలం కోసం మరో పది ఎకరాల స్థలాన్ని రిజర్వ్ లో ఉంచారు.

ఇంటి కోసం 11వేల దరఖాస్తులు

ఇక లబ్దిదారుల ఎంపికపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటి కోసం 11వేల దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో 250 మంది సిబ్బంది సాంకేతికంగా, మ్యానువల్ గా దరఖాస్తులను వడపోశారు. ఇంటి పన్నుల చెల్లింపు దారుల సమాచారం, రిజిస్ట్రేషన్ శాఖ, రవాణా శాఖ నుంచి సమాచారం తెప్పించుకుని.. పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఆస్తిపాస్తులు లేని.. నిరుపేదలే అని నిర్ధరించుకున్న తర్వాతే వారిని ఎంపిక చేశారు. లబ్దిదారుల జాబితా వార్డుల వారీగా బహిరంగంగా ప్రదర్శించి.. ఫిర్యాదులు స్వీకరించారు. ఇలా ఇప్పటి వరకు 1354మందిని ఎంపిక చేశారు. ప్రతి లబ్దిదారునికి పట్టు బట్టలు పెట్టి మరీ.. ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం, ఆస్తి పన్ను పత్రం, విద్యుత్ కనెక్షన్, గ్యాస్ కనెక్షన్​కు సంబంధించిన పత్రాలు అందించారు. ఇంట్లో విద్యుత్ ఉపకరణాల నుంచి అన్నీ సిద్ధం చేసి.. ముఖ్యమంత్రి సమూహిక గృహ ప్రవేశాలు చేయించారు. ఇల్లును, వారికి కల్పించిన సదుపాయలను చూసి లబ్దిదారులు భావోద్వేగానికి గురయ్యారు. ఇటువంటి ఇంట్లో తాము ఉంటామని కలలో కూడా ఊహించలేదని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దగ్గర ఉండి మరీ గృహ ప్రవేశం చేపించడం తమ పూర్వ జన్మ సుకృతంగా వారు భావిస్తున్నారు.

లబ్ధిదారులతో ప్రత్యేకంగా కమిటీలు

అన్ని రకాల సౌకర్యాలతో.. నాణ్యతతో.. ఇల్లు సొంతమవడం కలలా ఉందని కొందరు లబ్ధిదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కడని తాము అద్దె కట్టలేక అనేక సార్లు వస్తువులు తాకట్టు పెట్టామని.. ఇక అటువంటి దుస్థితి తమకు తప్పిందని లబ్దిదారులు కన్నీటి పర్యంతమయ్యారు. నిర్వాహణపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.లబ్ధిదారులతో ప్రత్యేకంగా కమిటీలు వేసి.. కాలనీ నిర్వాహణ బాధ్యతలు అప్పగించనున్నారు. గృహ సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక్కడి వసతులు, సౌకర్యాలకు ముక్దుడయ్యారు. దేశంలోనే ఇటువంటి కాలనీ లేదని కితాబు ఇచ్చారు. మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేశారు.

ఇదీ చదవండి: ప్రకటనలకే పరిమితం.. కానరాని ప్రత్యామ్నాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.