ETV Bharat / state

సిద్దిపేటలో అత్యాధునిక హంగులతో గ్రంథాలయం - Siddipet model library news

సిద్దిపేట అంటేనే అన్నింటా రాష్ట్రానికి ఆదర్శం. ఆ కోవలోనే తాజాగా అన్ని హంగులతో డిజిటల్‌ గ్రంథాలయం సైతం ఏర్పాటు చేశారు. యువత, వృద్ధులు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల వారు పుస్తకపఠనం చేసేలా ప్రత్యేక గదులు నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గ్రంథాలయంలో మహిళలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు.

Digital Library
గ్రంథాలయం
author img

By

Published : Apr 11, 2021, 7:52 PM IST

పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడు. మనిషికి విజ్ఞానాన్ని పంచే చోదకంగా చెబుతారు. గ్రంథ పఠనం అత్యుత్తమ అలవాటు. పుస్తకాల గని గ్రంథాలయం. ఒకపుడు పుస్తక ప్రియులతో గ్రంథాలాయలు కళకళలాడేవి. కాలక్రమంగా మారుతున్న అభిరుచులతో పఠనాసక్తి సన్నగిల్లి గ్రంథాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి.

మంత్రి ప్రత్యేక చొరవ...

ప్రజల్లో తిరిగి పఠనాసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఆధునిక హంగులతో సిద్దిపేటలో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని నిర్మించారు. నేటి యువత అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వనిత పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా విభాగం...అందులో వారికి అధికంగా అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉంచారు. నిరుద్యోగ యువత కోసం పోటీ పరీక్షల సమగ్ర మెటీరియల్‌ చదువుకునే వెసులుబాటు కల్పించారు. ఉర్దూ, చిన్నపిల్లలు, వృద్థులు ఇలా ప్రత్యేకంగా తొమ్మిది విభాగాలు ఏర్పాటు చేశారు.

యువత హర్షం...

కోట్లాది పుస్తకాలు అంతర్జాలంలో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా డిజిటల్ లైబ్రరీని సైతం ఏర్పాటు చేశారు. సమావేశాలు, సమీక్షలు, శిక్షణ తరగతులు నిర్వహించుకునేందుకు సెమినార్ హాల్‌ను సర్వహంగులతో సిద్ధం చేశారు. ఆధునిక గ్రంథాలయం ఏర్పాటుపై యువత హర్షం వ్యక్తం చేస్తోంది.

సిద్దిపేట వాసులకు అత్యాధునికి గ్రంథాలయం అందుబాటులోకి రావడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అత్యాధునిక హంగులతో గ్రంథాలయం

ఇదీ చూడండి: సాగర్​లో ప్రత్యేక వ్యూహం... సామాజికవర్గాల వారిగా పార్టీల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.