ఇవీ చూడండి: మే15 నుంచి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు!
ప్రత్యామ్నాయ అటవీకరణ పనులపై సీఎస్ ఆరా - government
చెట్ల పెంపకం కోసం సిద్దిపేట జిల్లాలో ఏర్పాట్లను సీఎస్ ఎస్కే జోషి పరిశీలించారు. అటవీశాఖ అభివృద్ధి చేసిన పలు నర్సరీలను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
నర్సరీలను పరిశీలించిన సీఎస్
కాళేశ్వరం నిర్మాణంలో నష్టపోతున్న అటవీ సంపదకు ప్రత్యామ్నాయంగా పెంచుతున్న నర్సరీలను సీఎస్ జోషి పరిశీలించారు. కాళేశ్వరం నిర్మాణంలో పోతున్న చెట్ల స్థానంలో... కొత్త మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. ప్రతిపాదిత ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీకరణను క్షేత్రస్థాయిలో పర్యటించారు. ములుగుతో పాటు వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ నర్సరీలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ శాఖ యంత్రాంగం పనితీరుపై ప్రధాన కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా ప్రధాన కార్యదర్శికి అటవీశాఖ అధికారులు వివరించారు.
ఇవీ చూడండి: మే15 నుంచి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు!
tg_srd_01_26_cs_visit_ab_r22
రిపోర్టర్: క్రాంతికుమార్, స్టాఫర్
() కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సిద్ధిపేట జిల్లాలో చేపడుతున్న కంపెన్సేటరీ అఫోర్ స్టేషన్ పనులను సీఎస్ జోషి పరిశీలించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నర్సరీ, అటవీ అభివృద్ధి చేసిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వేగవంతంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపడుతున్నట్లుగానే లక్ష్యాలకు అనుగుణంగా కంపెన్సేటరీ అఫోర్ స్టేషన్ పనులను తొందరగా పూర్తి చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ముందుగా ములుగులోని అటవీ శాఖ నర్సరీలో మొక్కల పెంపకాన్ని పీసీసీఎఫ్ పీకే ఝా, ఏపీ పీసీసీఎఫ్.. జిల్లా అధికారిక యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఆటవీకరణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఛాయా చిత్ర ప్రదర్శన ద్వారా ప్రధాన కార్యదర్శికి అటవీశాఖ అధికారులు వివరించారు. ప్రతిపాదిత ప్రాంతాలలో అటవీయేతర భూముల్లో చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీకరణ భూముల ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ములుగు నర్సరీ నుంచి నర్సంపల్లి, దామరకుంట, బెజ్జంకి ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం గౌరారం-నెంటూరులో ఎవెన్యూ ప్లాంటేషన్ ను పనులు పరిశీలించారు. గజ్వేల్ పట్టణ శివారులో కల్పకవనం అటవీ పార్కును సందర్శించారు. జిల్లా అటవీ శాఖ యంత్రాంగం మంచి పని చేస్తున్నదని ప్రధాన కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు.....Byte
బైట్: జోషి, ప్రధాన కార్యదర్శి.