వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. మార్కుక్, ములుగు మండలం చిన్న తిమ్మాపూర్ గ్రామాల్లోని వరి, పత్తి పంటలు పరిశీలించారు. రైతులను, అధికారులను అడిగి పంట నష్టం వివరాలు తెలసుకున్నారు.
తిమ్మాపూర్‌లోని పలువురు రైతులు వర్షాలకు దెబ్బతిన్న తమ పత్తి మొక్కలు తీసుకొచ్చి కేంద్ర బృందానికి చూపించారు. వాటి వివరాలను బృందం సభ్యులు నమోదు చేసుకున్నారు. అనంతరం కేంద్ర బృంద సభ్యులు మార్కూక్లోని కొండపోచమ్మ పంప్‌హౌస్‌ను సందర్శించారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించి.. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.
ఇదీ చదవండిః పాతబస్తీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం