double bedroom houses Controversy in Gajwel: ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం.. వందల కోట్లమేర వ్యయం.. ఎంతో మంది పేదల ఆశల సౌధం.. సొంతింటి కల నెరవేర్చే స్వప్నం అదే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం. చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నా క్షేత్ర స్థాయిలో అర్హులకు ఈ పథకం ద్వారా ఇళ్లు ఇవ్వడం లేదని పలుచోట్ల ఆశావాహులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. తమకు ఇళ్లు ఇవ్వలేదంటూ కొందరు ఏకంగా గ్రామ సర్పంచ్ భర్తపై దాడి కూడా చేశారు.
ఇది జరిగింది: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక మండలం ఖమ్మంపల్లిలో 41 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈరోజు పంపిణీ చేశారు. కార్యక్రమం ముగిశాక కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. అనర్హులకు ఇళ్లు కేటాయించారంటూ తమకి న్యాయం చేయాలని గ్రామసర్పంచ్ ముందు వాపోయారు. కొందరు మహిళలు ఒకానొక సమయంలో సహనం కోల్పోయి సర్పంచ్ భర్త మల్లయ్యపై చేయిచేసుకున్నారు.
ఇవీ చదవండి: