దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో దిగేందుకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. గడిచిన మూడు రోజులుగా దుబ్బాక నుంచి పోటీ చేసేందుకు అభ్యర్ధి ఎంపికపై చర్చ జరుగుతుంది. దాదాపు డజను మంది పేర్లు పీసీసీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఆదరణతోపాటు కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్న బలమైన వ్యక్తిని బరిలో దించాలని పార్టీ యోచిస్తోంది.
అందువల్లే..
దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆకస్మికంగా చనిపోయిన రామలింగారెడ్డి సతిమణిని తెరాస అభ్యర్ధిగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రకటించాలని యోచిస్తోన్న కాంగ్రెస్ పార్టీ వెను వెంటనే అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి నే...తను కాంగ్రెస్ పార్టీ లో చేరలేదని.. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు తెలిపారు.
'తుది నిర్ణయం వెల్లడిస్తాను'
కార్యకర్తలు, అభిమానులు, బంధువులు తదితరులతో సమావేశమై సలహాలు, సూచనలతో తుది నిర్ణయం వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని బరిలో దించడమా....లేఖ ప్రత్యామ్నాయంగా మరొక అభ్యర్థిని ఎంపిక చేసి ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు నుంచి సమాచారం
ఇదీ చదవండిః దుబ్బాక తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్