ETV Bharat / state

'42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది వినడం మొదటిసారి'

author img

By

Published : Oct 27, 2020, 10:12 PM IST

సిద్దిపేటలో కాంగ్రెస్​ నేత వి.హనుమంతరావు పర్యటించారు. దుబ్బాక ఘటనలో అటు పోలీసులు, ఇటు భాజపా నాయకులు దొంగ మాటలే మాట్లాడుతున్నారని ఆరోపించారు. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి మాట వినడం మొదటిసారని పేర్కొన్నారు.

congress-senior-leader-hanumantharao
కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు

దుబ్బాక ఘటనపై కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు స్పందించారు. సిద్దిపేటలో పర్యటించిన వీహెచ్​.. భాజపా అభ్యర్థి రఘునందన్​రావు ఇంట్లో సోదాలు చేసే ముందు నోటీస్ ఇచ్చామని ఇటు పోలీసులు.. ఇవ్వలేదని అటు భాజపా వాళ్లు చెబుతున్నారని చెరో మాట అంటున్నారని అన్నారు. పోలీస్ అధికారులే తమ ఇంట్లో డబ్బులు పెట్టారని భాజపా నాయకులు కొత్త ఆనవాయితీని మొదలు పెట్టారు.

పోలీసులకు ఎక్కడైనా డబ్బు దొరికితే తీసుకునే అలవాటు ఉంది కానీ.. పెట్టే అలవాటు లేదని వీహెచ్​ వ్యాఖ్యానించారు. తన 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి మాట వినడం మొదటిసారని అన్నారు. ఇప్పటికే అన్ని కుల సంఘాలకు తెరాస డబ్బులు పంచిందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన తెరాస.. నీళ్లు మాత్రమే ఇచ్చి నిధులు, నియామకాలు మర్చిపోయిందని మండిపడ్డారు.

దుబ్బాక ప్రాంతంలో తెరాస ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముత్యం రెడ్డి హయాంలో చేసిన అభివృద్ధి తప్ప.. దుబ్బాకలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.

ఇదీ చూడండి: దీక్షా శిబిరం నుంచి ఆసుపత్రికి బండి సంజయ్ తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.