ETV Bharat / state

'దుబ్బాక ఎన్నిక నాలుగు కోట్ల మంది భవిష్యత్​కు సంబంధించినది' - సిద్దిపేట జిల్లా వార్తలు

బంగారు తెలంగాణ పేరు చెప్పి మూడు లక్షల కోట్ల అప్పులు చేశారని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్​లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

'దుబ్బాక ఎన్నిక నాలుగు కోట్ల మంది భవిష్యత్​కు సంబంధించినది'

author img

By

Published : Oct 8, 2020, 7:25 PM IST

ప్రజలను ముంచేందుకే తెరాస ప్రభుత్వం ఎల్ఆర్​ఎస్​ను తీసుకొచ్చిందని కాంగ్రెస్​ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్​ హయాంలో కట్టింటిన ఇళ్లపై విమర్శలు చేసిన ముఖ్యమంత్రి... ఏడేళ్లలో ఎన్నిళ్లు కట్టించారో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్తూ సిద్దిపేటలోని ప్రజ్ఞాపూర్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

లక్ష ఉద్యోగాలు ఖాళీలుండగా కనీసం ముప్పై వేలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ఏది ఏమైనా దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్​ గెలుపు ఖాయమన్నారు. దుబ్బాక ఎన్నిక నాలుగు కోట్ల మంది భవిష్యత్​కి సంబంధించినదని అన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'దుబ్బాకలో గెలుపు కాంగ్రెస్​దే... రెండో స్థానం కోసమే వారి కొట్లాట'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.