టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హస్తం నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు దీక్ష చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు వద్ద కొనుగోలు చేసిన వెంటనే నిలవ ఉంచకుండా సకాలంలో మిల్లులకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, జిల్లా కార్యదర్శులు చిత్తారి రవీందర్, కోమటి సత్యనారాయణ, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హసన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!