ETV Bharat / state

'ఆ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిని నియమించాలి'

హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల డాక్టర్​ని నియమించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జిల్లా డిప్యూటీ వైద్యాధికారి మురళీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు. కరోనా మూడో వేవ్​ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న తరుణంలో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కోరారు.

husnabad government hospital
'ఆ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిని నియమించాలి'
author img

By

Published : Jun 7, 2021, 4:44 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిని నియమించేలా చొరవ చూపాలని.. ఆసుపత్రి వైద్యాధికారి మురళీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్ వినతిపత్రం అందించారు.

కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున… ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఆ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిని నియమించాలని కోరారు. పిల్లలకు ప్రతిరోజు వైద్య పరీక్షలు, చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

కొన్ని రోజుల క్రితం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సమావేశం నిర్వహించిన జిల్లా వైద్యాధికారి… ఇంతవరకు ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే హుస్నాబాద్ ఆసుపత్రిలో కొవిడ్​ రోగుల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

ఇదీ చూడండి: Bandi Sanjay : 'రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.