పెండింగ్ కేసులపై గజ్వేల్ ఏసీపీ కార్యాలయంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల వారీగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ తగాదాల్లో ఫిర్యాదుదారుడు, ప్రతివాది తప్ప మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. మహిళలు, మైనర్లపై అత్యాచారం కేసులో సాంకేతికత ఉపయోగించి నేరస్తులకు శిక్షపడే విధంగా ఛార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ ఫైవ్-ఎస్ విధానం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నందున.. సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.