ETV Bharat / state

కలెక్టరేట్‌లో మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్ - సిద్దిపేట లేటెస్ట్ అప్డేట్స్

కలెక్టరేట్ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకటరామ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 29 లోపు సర్వం సిద్ధం చేయాలని సూచించారు. దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తోన్న కలెక్టరేట్ నిర్మాణాన్ని గదులు, బ్లాకులు, అంతస్తుల వారీగా ఆయన పరిశీలించారు.

collector review on collectorate in siddipet
కలెక్టరేట్‌లో మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్
author img

By

Published : Nov 26, 2020, 7:17 PM IST

కలెక్టరేట్‌ నిర్మాణంలో మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకటరామ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 29లోపు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేయాలని సూచించారు. సిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తోన్న కలెక్టరేట్ నిర్మాణాన్ని గురువారం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. అసంపూర్తి పనుల బాధ్యతలను పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు అప్పగించి... త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

కలెక్టరేట్‌లో వివిధ శాఖల వారీగా ఫర్నీచర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్అండ్‌బీ ఈఈ సుదర్శన్‌కు సూచించారు. భవనంలోని గదులు, బ్లాకులు, అంతస్తుల వారీగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పద్మాకర్, ముజమ్మీల్ ఖాన్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, కొండపాక తహసీల్దార్ రామేశ్వర్, ఆర్అండ్‌బీ శాఖ డీఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.