ETV Bharat / state

సీఎం చొరవతో ఏళ్ల నుంచి ఉన్న భూసమస్య పరిష్కారం

సీఎం కేసీఆర్ చొరవతో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూసమస్య నేడు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్​పూర్​లోని కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో భూముల సమస్యల పరిష్కారం కోసం సర్పంచులు, రైతులతో ఫోన్​లో సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడి భూసమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు.

cm kcr ordered to solve the place problems in siddipet

author img

By

Published : Jul 25, 2020, 3:05 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్​పూర్ మండలంలోని కొత్తపేట, లింగారెడ్డి పల్లి, ఇటిక్యాల గ్రామాల్లో కొన్నేళ్లుగా పెండింగ్​లో ఉన్న భూసమస్యలను పరిష్కరించాల్సిందిగా... సీఎం కేసీఆర్ జిల్లా యంత్రాగాన్ని అదేశించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అధికారులు గ్రామాల్లోని రైతులతో, సర్పంచ్​లతో సమావేశం నిర్వహించారు.

తాత, ముత్తాతల నుంచి ఉన్న భూసమస్యలను సైతం పరిష్కరించేందుకు కృషి చేసి పట్టాలు అందేలా చూస్తామని రైతులకు కలెక్టర్​ భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న భూ సమస్యలు త్వరలో పరిష్కారం కానుండటం వల్ల ఆయా గ్రామల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రుణం ఎప్పటికీ మరచిపోమని రైతులు హర్షిస్తున్నారు.

ఇదీ చదవండిః కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.