సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ పంప్‌హౌస్‌ను ప్రారంభించి కొండపోచమ్మ జలాశయానికి నీటిని విడుదల చేశారు సీఎం కేసీఆర్. మర్కూక్ పంప్‌హౌస్ వద్ద సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. పంప్‌హౌస్ వద్ద సుదర్శన యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. సుదర్శన యాగంలో త్రిదండి చినజీయర్ స్వామి పూజలు చేశారు. కొండపోచమ్మ జలాశయం వద్ద గంగా పూజ నిర్వహించిన అనంతరం గోదావరి జలాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామి హారతి ఇచ్చారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను జలాశయంలో పోశారు.
ఇవీ చూడండి : అక్కారం పంప్‌హౌజ్ నుంచి మర్కూక్‌కు నీటి విడుదల