ETV Bharat / state

దుబ్బాకలో రాజుకున్న రాజకీయవేడి.. బీఆర్​ఎస్​, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలు

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాజకీయ వేడి రాజుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సహా వివిధ ప్రారంభోత్సవాల వేదికగా బీఆర్‌ఎస్‌-బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రులు హరీశ్​రావు, నిరంజన్ రెడ్డి, అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డిలు రాగా.. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ ఇరు పార్టీల శ్రేణులను నియంత్రించారు.

harish rao Inaugurate Siddipet warehouses
సిద్దిపేట గోదాములు ప్రారంభోత్సవంలో రసబస
author img

By

Published : Dec 30, 2022, 3:01 PM IST

Updated : Dec 30, 2022, 3:42 PM IST

దుబ్బాక బీఆర్​ఎస్​-బీజేపీ పోటాపోటీ నినాదాలతో దద్దరిల్లుతోంది. ఆర్టీసీ బస్టాండ్ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రులు హరీశ్​రావు, నిరంజన్ రెడ్డి, అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డిలు వచ్చారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున రావడంతో.. పోటీగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీఆర్​ఎస్​ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి తమపై ఆంక్షలు విధిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.

ముందుగా హబ్సిపూర్‌లో గోదాములను మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సమయంలో బీఆర్​ఎస్​, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్​ఎస్​, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో మంత్రులు హడావిడిగా కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్లిపోయారు.

ఇక దుబ్బాక ఉపఎన్నిక నుంచి రాజకీయ సవాళ్లకు వేదికగా నిలిచిన ఈ బస్టాండ్.. మరోసారి స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. కొత్త బస్టాండ్ నిర్మిస్తామని బీఆర్​ఎస్​, బీజేపీలు హామీ ఇచ్చాయి. దాదాపుగా రూ.4 కోట్లతో నిర్మాణం పూర్తి చేశారు. ఈ క్రమంలో బస్టాండ్​ను తమ ఖాతాలో వేసుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చామని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతుంటే.. తాము ప్రస్తావించడం వల్లే పూర్తయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

దుబ్బాకలో రాజుకున్న రాజకీయవేడి.. బీఆర్​ఎస్​, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలు

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.