ETV Bharat / state

కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కేంద్రం కాలరాస్తోంది: సీఐటీయూ

కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్ కుమార్ ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.... హుస్నాబాద్​లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

citu protest for anti labor policies in india at husnabad siddipet district
కేంద్రం కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని కాలరాస్తుంది: సీఐటీయూ
author img

By

Published : Jul 3, 2020, 4:32 PM IST

కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుదించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్ కుమార్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ కాలానికి గాను కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తూ... 8 గంటల నుంచి 12 గంటలకు పెంచే నిర్ణయం తీసుకుందని రేవంత్ కుమార్ అన్నారు.

పలు ప్రభుత్వరంగ సంస్థల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ... పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా సామాన్య ప్రజలపై భారం వేస్తూ... ముడి చమురు సంస్థలకు కొమ్ముకాస్తుందన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: భారత్​లో రెండో వ్యాక్సిన్-​ ప్రయోగానికి అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.