ETV Bharat / state

'మున్సిపల్​ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి' - citu protest at husnabad on sanitation workers

పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి... కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్​ కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జులై 3 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్​కుమార్ తెలిపారు.

citu protest at husnabad on sanitation workers
'మున్సిపల్​ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి'
author img

By

Published : Jul 1, 2020, 4:16 PM IST

మున్సిపల్​ కార్మికులకు రూ.24,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్​ కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్​ కాంట్రాక్ట్​ ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులను పర్మినెంట్​ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రేవంత్​కుమార్ డిమాండ్​ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 3న మున్సిపల్​ కార్యాలయాల ఎదుట ధర్నా, 9న ఎమ్మెల్యేలకు వినతి పత్రం సమర్పించడం, 20న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు రేవంత్​కుమార్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి: రాష్ట్రంలో మరో 945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.