సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపించారు. రుణమాఫీ, రైతుబంధు, బీడీ కార్మికులకు పెన్షన్ రావడం లేదని తహసీల్దార్‌కు మెమోరాండం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి రైతులు ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరికీ కొత్తగా పింఛన్లు అందించలేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ నాయకులతో సోమేశ్‌కుమార్ కమిటీ చర్చలు