దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక మరికాసేపట్లో ముగియనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా... సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం నమోదైంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు.
గర్భిణులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక లైన్లు కేటాయించి, వీల్ ఛైర్లలో కేంద్రంల్లోకి పంపిస్తున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు... ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పీపీఈ కిట్లతో వచ్చిన కరోనా బాధితులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఇదీ చూడండి: ఆరేపల్లిలో మొరాయించిన ఈవీఎం.. మరో మిషన్తో పోలింగ్