ETV Bharat / state

దుబ్బాకలో ముగిసిన ప్రచార పర్వం.. ఈనెల 3న పోలింగ్ - దుబ్బాక ఉపఎన్నిక తాజావార్తలు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దుబ్బాకలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. సవాళ్లు.. విమర్శలు.. ప్రతి విమర్శలతో మారుమోగిన మైకులు సాయంత్రం ఆరు గంటల నుంచి మూగబోయాయి.

By-election campaign ends in Dubaka constituency
దుబ్బాకలో ముగిసిన ప్రచార పర్వం
author img

By

Published : Nov 1, 2020, 6:00 PM IST

త్రిముఖ పోటిగా ఉన్న దుబ్బాక ఉప ఎన్నిక బరిలో 23మంది నిలిచారు. తెరాస నుంచి ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ నుంచి పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భాజపా నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎన్నికల బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహ.. ప్రతి వ్యూహాలు పన్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడ్డారు. గడువు ముగియడంతో ప్రచారాలకు తెరపడింది.

సర్వం సిద్ధం

ప్రచారానికి తెరపడటంతో.... 3వ తేదీన ప్రశాంత వాతవరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 315పోలింగ్ కేంద్రాల్లో లక్షా 98 వేల 756మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 3వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే వీరికి రెండు పర్యాయాలు శిక్షణ ఇచ్చారు. ఈవీఎంల పనితీరు కూడా పరిశీలించారు. సోమవారం దుబ్బాకలోని స్ట్రాంగ్ రూం వద్ద సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

144 సెక్షన్ అమలు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా... 2వేల మంది పోలీసు సిబ్బంది, నాలుగు కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. సమస్యాత్మక 89పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక బలగాలు మోహరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి నాలుగో తేది వరకు దుబ్బాక నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా 10చెక్ పోస్టులతో పాటు... 15ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

5గంటల తర్వాత అనుమతి

కరోనా నేపథ్యంలో ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 80సంవత్సరాల వయసు పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. కరోనా బాధిత ఓటర్లకు ఉచితంగా పీపీఈ కిట్లు అందిస్తున్నారు.

ఇవీచూడండి: దుబ్బాకలో గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.