ETV Bharat / state

BRS BJP Clash at Siddipet Train Inauguration : సిద్దిపేటకు రైలు వచ్చినవేళ.. బీజీపీ, బీఆర్​ఎస్​ మధ్య రసాభాస - బీఆర్​ఎస్​ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

BRS BJP Clash at Siddipet Train Inauguration : సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు మొదటి రైలు ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. సిద్దిపేట స్టేషన్‌ నుంచి మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించగా.. మరోవైపు సిద్దిపేట మనోహరాబాహాద్‌ రైలు మార్గాన్ని ప్రధాని మోదీ నిజామాబాద్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో.. రైలు మార్గం ఘనత తమందంటే తమదేనంటూ నినాదాలు చేస్తూ.. బీఆర్​ఎస్​, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో పలువురికి గాయాలవడంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

MLA Ragunandhan Rao Reaction on Siddipet Railway Station Opening
BJP and BRS Clash at Siddipet Train Inauguration
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 7:49 AM IST

Clash at Siddipet Train Inauguration సిద్దిపేట రైలు ప్రారంభంలో నాయకుల మధ్య ఘర్షణ

BRS BJP Clash at Siddipet Train Inauguration : సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌ మొట్టమొదటి రైలును నిజామాబాద్​లో ప్రధాని మోదీ వర్చువల్‌గా.. సిద్దిపేట నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. అదే రైలులో మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎమ్మల్యే రఘునందన్‌రావు బయలుదేరారు. హరీశ్‌ రావు దుద్దెడ వరకు ప్రయాణించగా.. రఘునందన్‌రావు గజ్వేల్‌ వరకు వెళ్లారు. అంతకుముందు ప్రారంభోత్సవ సమయంలో.. బీఆర్ఎస్​, బీజేపీ కార్యకర్తలు సిద్దిపేట రైల్వేస్టేషన్‌కు ప్లకార్టులు, జెండాలు చేతబూని భారీగా తరలివచ్చారు.

Siddipet Secunderabad Inauguration 2023 : రైలు మార్గం ఘనత తమదంటే తమదంటూ నినదించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక దశలో జెండా కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మోదీ ఫొటోలతో కూడిన ప్లెక్సీలను బీఆర్​ఎస్​ కార్యకర్తలు చించేశారు. మరోవైపు కేసీఆర్ ఫొటో లేదని మండిపడుతూ మంత్రి హరీశ్‌రావు.. మోదీ ఫొటోలున్న ఎల్​ఈడీ తెరలను పక్కన పెట్టించారు. భారీగా మోహరించిన పోలీసులు.. ఇరువర్గీయులను చెదరగొట్టారు. సుమారు రెండున్నర గంటలపాటు నెలకొన్న ఘర్షణ వాతావరణం రైలు వెళ్లిపోయాక సద్దుమణిగింది.

Harish Rao at Gajwel Ring Road Opening : 'మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మూడు పంటలు ఇచ్చే కేసీఆర్‌ కావాలా..?'

Harish Rao on Siddipet Railway Station Opening : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్‌(Kothapalli- Manoharabad Railway Line) నిర్మాణంలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.640కోట్లు వెచ్చించిందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. భూసేకరణ, ఇతర పనులన్నీ చేసి కేంద్రానికి సహకరిస్తే.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనీసం సీఎం కేసీఆర్ ఫొటో పెట్టకపోవడం శోచనీయచమని హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణం, రైలు కల సాకారం.. ఇలా అన్నీ బీఆర్​ఎస్​ ఘనతేనని స్పష్టం చేశారు.

"కేసీఆర్​ ముఖ్యమంత్రి అయిన తరవాతే ఈ రైల్వే లైన్​కు ముందడుగు పడింది. రాష్ట్ర వాటా ద్వారా 33 శాతం చెల్లిస్తామని.. నిధులు మంజూరు చేశారు. త్వరగా ప్రారంభించేలా పనులు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. బీజేపీ నాయకులు రైలు వారే తెచ్చారని అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తే ముఖ్యమంత్రి ఫొటో పెట్టలేదు. దీనికి సంబంధించిన 2508 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించింది. దీనికి సుమారు రూ.310కోట్లు ఖర్చు అయ్యాయి." - హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

MLA Ragunandhan Rao on Siddipet Railway Station : సిద్దిపేట రైల్వే స్టేషన్‌(Siddipet Railway Station)లో.. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు వ్యవహరించిన తీరు దారుణమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. వారిపై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీలో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ప్రధాని మోదీ కార్యక్రమంలో ప్రసారమవుతున్న ఎల్​ఈడీ టీవీని కాలుతో తన్ని తీసేయించడం ఎంత వరకు సమంజసమని రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి.. ప్రధాని ప్లెక్సీలను చించేయాలని శ్రేణులను ఉసిగొల్పారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ రైలు మార్గం ఘనత పూర్తిగా బీజేపీదేనని స్పష్టం చేశారు.

సీఎం ఇలాకాలో కలికితురాయి.. నేటి నుంచి గజ్వేల్‌కు గూడ్స్‌ బండి

సిద్దిపేటకు రైలు బండి.. వచ్చేది అప్పుడేనండి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.