ETV Bharat / state

Black Panther: కొండపాక రిజర్వ్ ఫారెస్ట్​లో నల్లచిరుత సంచారం

కొండపాక రిజర్వ్ ఫారెస్ట్​లో బ్లాక్​పాంథర్ సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సెల్​ఫోన్​లో నల్ల చిరుత చిత్రాలను బంధించారు. అడవిలోకి సమీపంలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని.... అటవీలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచించారు.

Black Panther
నల్లచిరుత సంచారం
author img

By

Published : Jul 17, 2021, 12:29 PM IST

Updated : Jul 17, 2021, 1:19 PM IST

అరుదైన బ్లాక్​పాంథర్​ (Black Panther)ను అటవీ శాఖ అధికారులు సిద్దిపేట జిల్లాలోని అడవుల్లో గుర్తించారు. మల్లన్నసాగర్​ జలాశయం సమీపంలో ఉన్న కొండపాక రిజర్వ్ ఫారెస్ట్ (Kondapaka Reserve Forest)​లో... బండరాళ్ల పక్కనే నక్కిన నల్ల చిరుతను అటవీశాఖ సిబ్బంది కనుగొన్నారు.

Black Panther
బండరాళ్ల వెనుక నక్కిన నల్లచిరుత

దూరం నుంచే తమ చరవాణుల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రెండు చిరుతలు, వాటి పిల్లలు అడవిలో సంచరిస్తున్నాయని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. అప్పుడప్పుడు ఇవి సరిహద్దులకు వస్తున్నాయని వెల్లడించారు. అడవికి సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండపాక రిజర్వ్ ఫారెస్ట్​లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

ఇదీ చూడండి: Leopard : తిరుమలలో చిరుత సంచారం... భయాందోళనలో భక్తులు

Last Updated : Jul 17, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.