ETV Bharat / state

ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేవైఎం ధర్నా - Husnabad Latest News

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని హుస్నాబాద్​ ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. గత ఆరేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని బీజేవైఎం నాయకులు ఆరోపించారు.

BJYM
ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేవైఎం ధర్నా
author img

By

Published : Dec 15, 2020, 2:25 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని.. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ.. ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి విన్నవించాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల వ్యతిరేక విధానాలను విడనాడాలని బీజేవైఎం నాయకులు కోరారు. గత ఆరేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్​ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేవైఎం ఆందోళనలు ఉద్ధృతం చేస్తోందని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.