ETV Bharat / state

'మంత్రి హరీశ్, ఎంపీ ప్రభాకర్.. నా సవాల్​కు సిద్ధమా?' - bjp campaign in dubbaka

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులో మోటార్లకు మీటర్లు బిగించాలనే అంశం ఉంటే ప్రజలు వేసే ఏ శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానని భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు.

bjp campaign in dubbaka
'మంత్రి హరీశ్, ఎంపీ ప్రభాకర్.. నా సవాల్​కు సిద్ధమా?'
author img

By

Published : Oct 6, 2020, 3:57 PM IST

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో భాజపా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దౌల్తాబాద్​ మండలంలోని పలుగ్రామాల్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు పర్యటించారు. తొగుట మండలం తుక్కాపూర్​ గ్రామానికి చెందిన సర్పంచ్ సహా పలువురు రఘునందన్ రావు సమక్షంలో భాజపాలో చేరారు.

దుబ్బాక ఉపఎన్నికలో భాజపాను గెలిపించాలని కోరుతూ రఘునందన్ రావు ఓటర్లను అభ్యర్థించారు. పార్లమెంట్​లో ఆమోదింటిన వ్యవసాయ బిల్లుల్లో మోటార్లకు మీటర్లు పెట్టాలనే అంశం ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. ఒకవేళ ఆ అంశం బిల్లుల్లో లేకుంటే.. మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన సవాల్​ను స్వీకరించాలని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.