ETV Bharat / state

'కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా రైతులను ఆదుకోండి'

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని భాజపా ఆధ్వర్యంలో హుస్నాబాద్‌ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. ఎకరాకు రూ. 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గత ఆరేళ్ల నుంచి అకాల వర్షాలతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులను తెరాస ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపించారు.

bjp protests in siddipet district husnabad
'కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా రైతులను ఆదుకోండి'
author img

By

Published : Oct 23, 2020, 1:50 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగి తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భాజపా ధర్నా నిర్వహించింది. ఎకరాకు రూ. 25 వేలు చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు డిమాండ్‌ చేశారు. గత ఆరేళ్ల నుంచి అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారమివ్వకుండా కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు విమర్శించారు. తాజాగా జరిగిన పంటనష్టంపై కూడా నిర్లక్ష్యం వహిస్తోందని మండి పడ్డారు.

కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని శంకర్‌ బాబు దుయ్యబట్టారు. ఇప్పటికైనా కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఫాంహౌస్‌లో భూసార పరీక్షలు చేయించుకున్న కేసీఆర్‌.. కేంద్రం ఇచ్చిన రూ.125 కోట్ల నిధులను మాత్రం రైతుల పొలాల భూసార పరీక్షల కోసం వినియోగించలేదని శంకర్‌ ఆరోపించారు. వరికి క్వింటాల్‌కు ఇప్పుడున్న మద్దతు ధర రూ. 1880తో కలిపి మరో రూ.500 బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భాజపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: వాహనం ఢీకొని రెండేళ్ల కుమారుడితో పాటు తల్లి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.