తెరాస నాయకులు భాజపా కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా భాజపా అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం, గంభీర్పూర్ గ్రామాల్లో భాజపా అభ్యర్థి రఘనందన్ రావుతో పాటు డీకే అరుణ ప్రచారంలో పాల్గొన్నారు.
ఆదరణ కరవై.. అమ్మేశారు
కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరవై.. కేసీఆర్కు అమ్మేశారని డీకే అరుణ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రజల్లో కనిపించడం లేదని.. కాంగ్రెస్ భూస్థాపితం అయిందని విమర్శించారు. తెరాసలో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి భాజపాను అడ్డుకోవాలనే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చారన్నారు. తెరాస పెద్దలు పార్టీ ఓడిపోతుందని భయంతోనే ఇలా చేశారనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే ఎద్దేవా చేశారు.
తెరాసని ఓడించే దమ్ము ఒక భాజపాకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను ఓటు అడిగే హక్కు తెరాసకి లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సమర్థుడైన రఘునందన్ రావుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి: అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా: కేసీఆర్