ETV Bharat / state

'రూ. 80 వేల ప్లాట్​కు లక్షన్నర ఎల్​ఆర్​ఎస్​ కట్టాలటా...!' - dubbaka election updates

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో భాజపా ప్రచారం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీ అభ్యర్థి రఘునందన్​ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మందు, విందులతో జనాలను మభ్యపెడుతున్నారని రఘునందన్​ ఆరోపించారు.

bjp leader raghunadhanrao campaign for mla by elections

author img

By

Published : Oct 4, 2020, 5:36 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్​రావు ప్రచారం నిర్వహించారు. గతంలో రూ. 80 వేలకు తీసుకున్న ప్లాటుకు లక్షన్నర ఎల్​ఆర్​ఎస్​ కట్టమని ప్రభుత్వం చెబుతోందని రఘనందన్​ మండిపడ్డారు. అనాలోచిన నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారని విమర్శించారు.

ఎన్నడూలేని విధంగా మంత్రి హరీశ్​ రావు... జనాలకు మందు, విందు ఇస్తూ మభ్యుపెడుతున్నారని ఆరోపించారు. కుల సంఘాలు కట్టుకోండంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దుబ్బాకలో గెలుపు కోసం.. భాజపా ముమ్మర ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.