ETV Bharat / state

'నాలుగుసార్లు గండి పడినా... కాంట్రాక్టర్​పై చర్యలెందుకు తీసుకోరు' - కొండపోచమ్మ సాగర్​కు గండి

కాంట్రాక్టర్​లతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఖజానాకు గండి పెట్టారని... భాజపా నాయకులు ఆరోపించారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు కట్టలు తెగినా... ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. తక్షణమే కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

bjp-former-mp-vivek-on-kondapochamma-sagar-reservoir-right-canal-breaks-down
'నాలుగు సార్లు గండి పడినా... కాంట్రాక్టర్​పై చర్యలు ఎందుకు తీసుకోలేదు?'
author img

By

Published : Jul 1, 2020, 11:34 AM IST

సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ కాలువ తెగిపోయి నీట మునిగిన గ్రామాన్ని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి విజయరామారావుతోపాటు భాజపా నేత లక్ష్మీనారాయణ సందర్శించారు.

జలాశయానికి పడిన గండిని చూస్తే... కాంట్రాక్టర్​లతో కలిసి కేసీఆర్ రాష్ట్ర ఖజానాకు గండి పెట్టారని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. రాష్ట్రంలో నా కంటే గొప్ప ఇంజనీర్​ లేరన్న కేసీఆర్... ఈ గండికి సమాధానం చెప్పాలని భాజపా అధికార ప్రతినిధి రఘునందన్ డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకు నాలుగు సార్లు కట్టలు తెగినా... ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. తక్షణమే కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నాణ్యత లోపాలున్న కాలువల వెంట ఉన్న గ్రామాలకు ముంపులు తప్పవన్నారు.

ఇవీ చూడండి: 'సెల్ఫ్ లాక్​డౌన్​ కానీ... దుకాణాలు ఇప్పుడు తెరిచేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.