భాజపా రాష్ట్ర అధిష్ఠానం పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి కృష్ణా నది జలాలను తరలించడం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదముందని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సర్కార్‌పై ఒత్తిడి తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, వేణు, తదితరులు పాల్గొన్నారు.
జీవో 203 రద్దు చేయాల్సిందే: భాజపా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భాజపా కార్యకర్తలు మౌన దీక్ష నిర్వహించారు. జగన్ సర్కార్ విడుదల చేసిన జీవో 203ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.