సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పంజా విసిరారు. సిద్దేశ్వర బుక్ షాపు తాళం పగలకొట్టి 20 వేల నగదును దోచుకెళ్లారు. యజమాని ఓ శుభకార్యానికి హైదరాబాద్ వెళ్లొచ్చి చూసేసరికి ఈ చోరీ జరిగింది. షాపులోని 20 వేల నగదు దోచుకెళ్లారని బాధితులు చెబుతున్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల హుస్నాబాద్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాళం వేసి ఊర్లకు వెళ్లాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చూడండి : కాళ్లు వణికే పయనం.. కళ్లు తిరిగే గమనం...