సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సీసీపల్లిలో ఎలుగుబంటి సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి సమయంలో ఎలుగుబంటి సంచారం చేయడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. రెండు మూడు రోజులుగా అర్ధరాత్రి దాటిన మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
ఎలుగుబంటి వచ్చే సమయంలో కుక్కలు మొరుగటం వల్ల స్థానికులు ఒకరికొకరు ఫోన్ల ద్వారా బయటికి రావొద్దని హెచ్చరించుకుంటున్నట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని గ్రామంలోకి రాకుండా నివారించాలని కోరుతున్నారు.