సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరుపై అవగాహన నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 41 బాల బాలికలకు ఠాణాలోని వివిధ శాఖల విధుల గురించి వివరించారు. పోలీసులు అందించే సేవల గురించి దుబ్బాక ఎస్సై మన్నె స్వామి తెలిపారు.
ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గది, కారాగారం, ఆయుధాగారం, ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే వైర్లెస్ యంత్రం గురించి అవగాహన కల్పించారు. ఆపద సమయాల్లో అందరూ డయల్ 100 కు ఫోన్ చేసి సేవలను పొందాలని సూచించారు.
ఇవీ చూడండి : పోషకాహార పైలట్ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలు