పురుగులమందు తాగి సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో మృతి చెందిన రైతు నర్సింహులు మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి తదితరులను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తన 13 కుంటల భూమిని ప్రభుత్వం లాక్కుంటోందని నర్సింహులు మొరపెట్టుకున్నా.. అధికారులెవరూ పట్టించుకోనందునే ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ ఎమ్మెల్యే సంపత్ ఆరోపించారు.
రైతు చనిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సంపత్ ప్రశ్నించారు. మృతుని కుటుంబాన్ని మంత్రి హరీశ్‌రావు ఆదుకోవాలని.. వారి కుటుంబానికి ఒక ఎకరం పొలం, రెండు లక్షల రూపాయల నగదు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:- యూనిఫామ్‌కు మ్యాచింగ్ మాస్కులు తప్పనిసరి..!