ETV Bharat / state

సీఎం కేసీఆర్​ దత్తత గ్రామాల్లో అన్నదాతల హర్షం - తెలంగాణలో సీఎం కేసీఆర్​ దత్తత గ్రామాలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ తన దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో వ్యవసాయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టారు. మౌలిక వసతుల కల్పనలో రెండు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం... సాగులోనూ ముందుండేలా సామూహిక బిందు సేద్యం విధానంలో ప్రతి ఎకరాకు నీరందిస్తున్నారు. ప్రతి రైతు మూడు పంటలు పండిచుకునేలా వసతులు కల్పించారు.

సీఎం కేసీఆర్​ దత్తత గ్రామాల్లో అన్నదాతల హర్షం

author img

By

Published : Feb 27, 2021, 7:24 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ దత్తత తీసుకోవడం వల్ల ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ముఖచిత్రమే మారిపోయింది. దేశానికే నమూనాగా తయారు చేయాలన్న లక్ష్యంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. రెండు గ్రామాలను పునర్​నిర్మించి... పట్టణాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మౌలిక వసతులు కల్పించారు. సాగులోనూ నమూనాగా తయారు చేయాలన్న లక్ష్యం నిర్దేశించికున్నారు. అందులో భాగంగా ఈ గ్రామాల పరిధిలోని భూమిని పూర్తిగా సాగులోకి తీసుకురావటంతోపాటు... అధిక ఆదాయమే లక్ష్యంగా ప్రణాళికలు రచించారు. మొదటి దశలో సాగుకు నిరుపయోగంగా ఉన్న భూముల్లో... రాళ్లు, ముళ్ల పొదలు తొలగించి అనుకూలంగా మార్చారు. సాగు నీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. సామూహిక బిందు సేద్య విధానంలో రెండు ఊర్లలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టారు.

కాళేశ్వరం జలాల రాకతో తొలగిన కష్టాలు...

ఆటోమేషన్ వంటి సాంకేతికతను వినియోగిస్తూ ఈ గ్రామాల పరిధిలోని మొత్తం 2,700 ఎకరాల వ్యవసాయ భూమిలో బిందు సేద్యం పరికరాలు అమర్చారు. సమష్టి విధానంలో బిందుసేద్యం ద్వారా సాగు నీరు అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రైతులకే బిందు సేద్యం పరికరాలు పూర్తి ఉచితంగా ఇవ్వాలి. బీసీ, ఓసీ వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులకు 90శాతం రాయితీ ఇవ్వాలి. కానీ... వర్గం, విస్తీర్ణంతో ప్రమేయం లేకుండా రైతులందరికీ పూర్తి రాయితీ ఇచ్చారు. ప్రతి 200 ఎకరాలను ఒక జోనుగా విభజించారు. ప్రతి జోనులో ఒక సంపు నిర్మించి.. దాని నుంచే నీరు అందిస్తున్నారు. సాగునీటి కోసం ఈ రెండు గ్రామాల మధ్య ప్రవహించే కూడవల్లి వాగుతో పాటు, చెరువులను అభివృద్ధి చేసి కాళేశ్వరం జలాలతో నింపారు. గతంలోనే పనులు దాదాపు పూర్తి చేసినా నీటి కొరత వల్ల ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. కాళేశ్వరం జలాల రాకతో సాగు నీటి కష్టాలు తొలగాయి. ఈ రబీ నుంచి రైతులకు బిందుసేద్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.

మూడు పంటలు పండించేలా...

రెండు గ్రామాల పరిధిలోని ప్రతి ఎకరాలోనూ ఈ వేసవిలో మూడో పంట పండించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆసక్తి లేని రైతులు ఉంటే వారి భూమిని పక్క రైతులకు కౌలుకు సైతం ఇప్పించేలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 1,200 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా నీటి సమస్య తీరడంతోపాటు కలుపు పని సైతం తగ్గిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామాలు త్వరలోనే సాగులోనూ ఆదర్శంగా నిలిచేలా అధికారులు, రైతులు కృషి చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'తెరాస సభ్యత్వానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.