సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర అవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని(telangana formation day 2021) సిద్ధ రామేశ్వర, రాజేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాటసారులకు అంబలి పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు.
మండే ఎండకు-కేసీఅర్ అంబలి అండ అనే నినాదంతో గత 10 ఏళ్లుగా టీటీడీ పాలక వర్గ సభ్యుడు మొరం శెట్టి రాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉచిత అంబలి వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హుస్నాబాద్‌తోపాటు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, ముల్కనూర్ ప్రాంతాలతోపాటు దాదాపు 15-20 కేంద్రాల్లో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంబలి కార్యక్రమం నిర్వహిస్తున్న ఫౌండేషన్ గౌరవ సభ్యులు మోరం శెట్టి రాములుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని పలువురు కోరారు.
ఇదీ చూడండి: Uttam: రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు