సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని రాంపూర్ వద్ద కూడవెల్లి వాగు చెక్ డ్యామ్ నిండు కుండను తలపిస్తోంది. స్థానికంగా ఉన్న అన్ని చెక్ డ్యాములు నుంచి వరద నీరు ఉద్ధృతి పెరగడం వల్ల... కూడవెల్లి వాగు వంతెన పైనుంచి కూడా నీరు ప్రవహిస్తోంది. ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడేళ్ల నుంచి సరిగ్గా కాలం కాక కూడవెల్లి వాగు వెలవెలబోయింది. మళ్లీ ఇన్నాళ్లకు వాగు పొంగడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణకు ఆదేశం