సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు ఇంటిని ఏబీవీపీ నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండివైఖరిని అవలంభిస్తోందని వారు ఆరోపించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: 'మినరల్ వాటర్ కన్న... మిషన్ భగీరథ నీళ్లు మిన్న'