సిద్దిపేటకు చెందిన డా.బండారి శ్రీనివాస్.. 1996-98లో ఎమ్మెస్సీ (సూక్ష్మ జీవశాస్త్రం) అభ్యసించారు. 2007లో ఎమ్మెస్సీ (వృక్షశాస్త్రం) పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ చేశారు. బోధనపై మక్కువతో 1998 నుంచే అధ్యాపకుడిగా వృత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం సిద్దిపేటలోని ఎస్‌ఆర్‌కే డిగ్రీ-పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు.
13 పరిశోధ
న వ్యాసాలు...
సూక్ష్మ జీవశాస్త్రంతో పాటు వృక్షశాస్త్ర తరగతులు బోధిస్తున్నారు. ఆయన సారథ్యంలో పలువురు విద్యార్థులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. పలు ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో రాసిన అనేక పరిశోధన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. ఇప్పటి వరకు ఆయన రాసిన మొత్తం 13 పరిశోధన వ్యాసాలను వివిధ ఇంటర్నేషనల్ జర్నళ్లు ప్రచురించాయి.
తాజాగా ‘రివ్యూ ఆన్ కరోనా వైరస్ డిసీస్ ఆఫ్ 2019 (కొవిడ్-19) అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్’ అంశంపై వ్యాసం రాయగా.. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ (యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ)లో చోటు దక్కించుకుంది. మే నెలలో వ్యాసం ప్రచురితమైంది. సుమారు 30 రోజుల పాటు కరోనా చుట్టూ అల్లుకున్న వివిధ అంశాలను అధ్యయనం చేసి పరిశోధన వ్యాసాన్ని పూర్తి చేశారు.
బోధించే సబ్జెక్టులతో పాటు సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం చేయడం ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు అధ్యాపకుడు శ్రీనివాస్. ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యార్థులు పరిశోధనలు చేస్తే సమాజాభివృద్ధిలో పాలు పంచుకున్నట్లేనని ఆయన చెబుతున్నారు.