ETV Bharat / state

చరవాణిలో చిత్రీకరించి యువకుని బలవన్మరణం

అమ్మాయి ప్రేమ కోసం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు అమ్మాయి తండ్రే కారణమంటూ చరవాణిలో చిత్రీకరించి పురుగుల మందు తాగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్మాముల గ్రామంలో చోటు చేసుకుంది.

యువకుని బలవన్మరణం
author img

By

Published : May 22, 2019, 7:05 PM IST

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామానికి చెందిన అనిల్​ కుమార్​ అనే వ్యక్తి గురువారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే గతంలో జరిగిన ప్రమాదంలో మెడపై గాయాలు కావడం వల్ల కలిగే నొప్పి తట్టుకోలేకే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనిల్​ తండ్రి కనకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ప్రేమ వ్యవహారమే కారణమని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చరవాణిలో చిత్రీకరిస్తూ యువకుని ఆత్మహత్య

వీడియో చరవాణిలో రికార్డు

అనిల్​ కొంత కాలంగా ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి ఆమెను మందలించారు. తమ అమ్మాయిని మర్చిపోవాలంటూ అనిల్​ను బెదిరించారు. చివరకు తాను అమ్మాయి తండ్రి వల్లనే చనిపోతున్నానంటూ చరవాణిలో చిత్రీకరించి... ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి : పాతగొడవతో స్నేహితున్నే హతమార్చాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.