సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళా సభ్యులు ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై అవగాహన చేపట్టారు. ప్రధాన రహదారుల ప్రక్కనే ఉన్న దుకాణాల్లోకి వెళ్లి ప్లాస్టిక్ కవర్ల వినియోగం, వాటి వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని గురించి వివరించారు.
దుకాణాల్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లను, గ్లాసులను సేకరించి వాటిని మున్సిపల్ వాహనాల్లో డంపింగ్ యార్డులకు తరలించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు బట్ట, కాగితపు సంచులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లను ఇకమీదట వినియోగిస్తే రానున్న రోజుల్లో అయిదు వేల రూపాయల వరకు జరిమానాలు విధిస్తామని మున్సిపల్ సిబ్బంది దుకాణాదారులకు తెలిపారు.
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది'